కొండపల్లి అడవిదొంగ నాపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది: దేవినేని ఉమ
- మంత్రులు పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలి
- మైలవరం వీరప్పన్ వసంత కృష్ణప్రసాద్
- గ్రావెల్ దొంగ నుంచి ప్రతి పైసా కక్కిస్తాం
పాలించడం చేతకాని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తనపై కేసులు పెట్టిస్తున్నారని అన్నారు. పేదలకు ఏం చేస్తున్నారో కూడా చెప్పుకోలేకపోతున్న నాయకులు... టీడీపీ నాయకులపై దాడులకు దిగడం దారుణమని చెప్పారు. కొండపల్లి అటవీభూముల్లో గ్రావెల్ అమ్ముకుంటున్న దోపిడీదారుల తిట్లకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు.
మైలవరం వీరప్పన్ కృష్ణప్రసాద్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొండపల్లి అడవిదొంగ తనపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. గ్రావెల్ దొంగ నుంచి ప్రతి పైసా కక్కిస్తామని చెప్పారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు కారణమైన వ్యక్తులకు 24 గంటల్లోనే బెయిల్ ఇప్పించిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనని విమర్శించారు.