రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ ను తొలగించిన ట్రంప్!
- ఎన్నికల్లో ఓడిపోయినా అంగీకరించని ట్రంప్
- కొత్త రక్షణ మంత్రిగా క్రిస్టొఫర్ మిల్లర్ నియామకం
- నాలుగేళ్లలో నలుగురిని మార్చిన ట్రంప్
గడచిన నాలుగేళ్లలో పెంటగాన్ చీఫ్ ను ట్రంప్ మార్చడం ఇది నాలుగోసారి. తాజాగా రక్షణ మంత్రి పదవి నుంచి తొలగించబడిన ఎస్పర్ 16 నెలల పాటు పదవిలో ఉన్నారు. ఆయన నిర్ణయాల కారణంగా తనకు రాజకీయ నష్టం సంభవించిందని ట్రంప్ భావించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దేశంలో పౌర సమాజం నిరసనలకు దిగుతున్న వేళ, ఫెడరల్ సైనిక దళాలను రంగంలోకి దించాలని ట్రంప్ ఒత్తిడి పెట్టినా, ఎస్పర్ వినలేదు. ఇప్పుడు ఆయన తొలగింపునకు అదే ప్రధాన కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక ఆఫ్ఘనిస్థాన్ నుంచి యూఎస్ సైన్యాన్ని వెనక్కు పిలిపించడం, ఆపై అక్కడ హింసాత్మక ఘటనలు పెరగడం కూడా ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. ఎస్పర్ తొలగింపు తప్పదని గత కొంతకాలంగా వైట్ హౌస్ అంతర్గత బృందం అంచనా వేస్తూనే ఉంది. అయితే, ఎన్నికల తరువాత ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.