ప్రభుత్వసాయం అటుంచితే నాయకులు, అధికారులు కనీసం పలకరించిన పాపాన పోలేదు: లోకేశ్
- వరద ప్రభావిత ప్రాంతాల్లో లోకేశ్ పర్యటన
- శృంగవరప్పాడు వరద బాధితులకు పరామర్శ
- కళ్లు చెమర్చాయన్న లోకేశ్
గ్రామస్తులకు ప్రభుత్వసాయం అటుంచితే, కనీసం నాయకులు, అధికారులు వచ్చి ఇంతవరకు పలకరించిన పాపాన పోలేదని లోకేశ్ విమర్శించారు. ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంత నిర్లక్ష్యమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి వైద్య సదుపాయాలు లేక విషజ్వరాలతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు ఆవేదనతో చెబుతుంటే కళ్లు చెమర్చాయని అన్నారు.