జడ్జీలపై సీఎం కంప్లయింట్ పెట్టిన రోజు నుంచి విజయసాయిరెడ్డి మైకు ముందుకు రావడం లేదు: బుద్ధా వెంకన్న
- ట్విట్టర్లో కూత పెట్టే పక్షి మౌన వ్రతం పాటిస్తోంది
- చిట్టి గుండె, చిన్న మెదడు వణుకుతున్నాయా?
- జగన్ ఫిర్యాదులకు విజయసాయి అనుకూలమా?
జడ్జీలపై ముఖ్యమంత్రి జగన్ ఫిర్యాదు చేసినప్పటి నుంచి విజయసాయిరెడ్డి మైకు ముందుకు రావడమే మానేశారని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. ఏం జరిగినా 'జై జగన్' అంటూ ట్విట్టర్లో కూత పెట్టే పక్షి ఇప్పుడు మౌన వ్రతం పాటిస్తోందని అన్నారు. చిట్టి గుండె, చిన్న మెదడు భయంతో వణుకుతున్నాయా? అని ప్రశ్నించారు. ఇంతకూ జగన్ చేసిన ఫిర్యాదులకు విజయసాయిరెడ్డి అనుకూలమా? లేక వ్యతిరేకమా? నోరు తెరిచి చెప్పండని డిమాండ్ చేశారు.