మద్యం సరఫరాకు టెండర్ వేసిన ఒకే ఒక్క బిడ్డర్ ఎవరు?: దేవినేని ఉమ
- అస్మదీయులకు కోట్ల రూపాయలు కట్టబెట్టేలా టెండర్?
- గతంలో పెట్ కు 18 రూపాయలు
- ఇప్పుడు 30 పైనే కోట్
- టెండర్ రాష్ట్రమంతా ఒక్కరికే ఎలా ఇస్తారు?
డిపోల నుంచి మద్యం రవాణా చేసేందుకు టెండర్లు పిలిచారని, 13 జిల్లాలకు కలిపి ఒకే టెండర్ ఉందని ఆ కథనంలో పేర్కొన్నారు. అది కూడా ఒక్కరు మాత్రమే టెండర్ వేశారని, అంతేగాక ప్రస్తుతమవుతున్న ఖర్చు కంటే దాదాపు 60 శాతం ఎక్కువ ధర కోట్ చేసినట్లు సమాచారం అందిందని అందులో ఆరోపించారు. సింగిల్ బిడ్ రావడంతో ఇప్పుడు ఈ టెండర్ నోటిఫికేషన్‌ను కూడా కనిపించకుండా చేశారని తెలిసిందని అందులో చెప్పారు.