తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్ట్

JC Prabhakar Reddy arrested by Anantapur police
  • నకిలీ పత్రాలతో 154 లారీలను రిజిస్ట్రేషన్ చేయించినట్టు ఆరోపణలు
  • హైదరాబాద్ నుంచి అనంతపురానికి తరలిస్తున్న పోలీసులు
  • బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా చూపించారన్న అభియోగాలు
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి లను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాదు శివారు శంషాబాద్‌లో వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతపురానికి తరలిస్తున్నారు. నకిలీ ధ్రువపత్రాలతో బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారన్న రవాణాశాఖ అధికారుల ఆరోపణలపై వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం 154 లారీలను ఇలా అక్రమంగా వీరు రిజిస్ట్రేషన్ చేయించినట్టు అధికారులు పేర్కొన్నారు.
Go Back to Shorts
JC Prabhakar Reddy
Tadipatri
Arrest
Anantapur District

More Telugu News