బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఫిక్సింగ్ కలకలం.. అనుమానాలు రేకెత్తించిన సంతోకి బౌలింగ్
- క్రికెట్‌లో ఎవరూ ఊహించని రీతిలో బంతులు విసిరిన సంతోకి
- క్రీజు బయటకు వచ్చేసి మరీ బౌలింగ్
- విచారణ కోరిన సొంత జట్టు డైరెక్టర్
కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌కు ఓవర్ ది వికెట్ బౌలింగ్ చేసిన సంతోకి లెగ్‌సైడ్‌కు చాలా దూరంగా పుల్‌టాస్ వేశాడు. టెస్టుల్లో కూడా ఆ బంతిని నిస్సందేహంగా వైడ్ ప్రకటించేంత దూరంగా ఆ బంతి పడింది. మరో రెండు బంతుల తర్వాత వేసిన నోబాల్ అయితే.. క్రికెట్ ప్రపంచాన్నే నిర్ఘాంతపోయేలా చేసింది. ఏకంగా క్రీజు బయటకు వచ్చేసి బౌలింగ్ చేశాడు. అతడి బౌలింగ్ తీరు అనుమానాస్పదంగా ఉండడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. చూస్తుంటే అతడి బౌలింగ్‌లో స్పాట్ ఫిక్సింగ్ కోణం ఉన్నట్టు కనిపిస్తోందని కామెంట్లు చేశారు. మరోవైపు, సిలెట్ థండర్స్ జట్టు డైరెక్టర్ తంజిల్ చౌధురి కూడా సంతోకి బౌలింగ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. అతడి బౌలింగ్‌పై విచారణ జరిపించాల్సిందిగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును అభ్యర్థించారు.