జగన్ అవినీతిపైనా అధ్యయనం చేయండి: ఐఐఎం అహ్మదాబాద్ కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ
- అవినీతి నిర్మూలనకు ఐఐఎం అహ్మదాబాద్ తో ఏపీ సర్కారు ఒప్పందం
- విమర్శల వర్షం కురిపిస్తున్న టీడీపీ నేతలు
- జగన్ అవినీతికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు
జగన్ ఎన్నో సూట్ కేసు కంపెనీలు ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయలు మళ్లించారని ఆరోపించారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని జగన్ అవినీతికి పాల్పడ్డాడని వివరించారు. సీఎం అయ్యాక ఇసుక, మద్యం, మైనింగ్ లో భారీస్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అంతేగాకుండా, ఐఐఎం అధ్యయనానికి పూర్తి సహకారం అందిస్తామని కళా వెంకట్రావు తన లేఖలో పేర్కొన్నారు.