రెండున్నర రోజుల్లోనే ముగిసిన డేనైట్ టెస్టు... డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని 'క్యాబ్' నిర్ణయం
- చివరి రెండ్రోజులకు టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు నగదు వాపసు
- సందేశాలు పంపించామన్న క్యాబ్ అధికారులు
- నగదు వాపసు ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడి
ఈ నేపథ్యంలో, చివరి రెండు రోజులకు మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) నిర్ణయించుకుంది. నాలుగు, ఐదు రోజులకు మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసినవారికి నగదు వాపస్ చేసే ప్రక్రియ షురూ అయిందని క్యాబ్ అధికారులు వెల్లడించారు. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి మెసేజ్ లు పంపించామని తెలిపారు.