మీ ముఖాలకు వేసుకోండి రంగులు... ప్రజలు వెంటనే జాగ్రత్తపడతారు: కడపలో చంద్రబాబు వ్యాఖ్యలు
- కడప జిల్లాలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం
- హాజరైన చంద్రబాబు
- వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు
"ఎంత తెలివైన వాడనుకోవాలి? మొన్నటికి మొన్న బార్లను కూడా రద్దు చేశాడు. ఇంకా ఆర్నెల్లు సమయం ఉండగానే వాటిని రద్దు చేశాడు. తన మనుషులకు బార్లు ఇచ్చుకోవాలన్నదే ఆయన ఉద్దేశం. ఇవన్నీ చిత్రవిచిత్రాలు. ఏంచెప్పాలో అర్థం కావడంలేదు" అంటూ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, వీళ్ల పిచ్చి పరాకాష్టకు చేరిందని, జాతీయ జెండాలకు కూడా వైసీపీ రంగులేసుకుంటున్నారని విమర్శించారు. గాంధీ విగ్రహాలే కాకుండా చివరికి దేవాలయాలకు, దేవుళ్లకు కూడా రంగులేస్తున్నారు అంటూ మండిపడ్డారు. "నేను చెబుతున్నాను... మీ ముఖాలకు వేసుకోండి రంగులు. మీ ఇళ్లకు కూడా వేసుకోండి. ప్రజలు మిమ్మల్ని చూసి జాగ్రత్తపడతారు. వైసీపీ దారిదోపిడీ దొంగలు ఉన్నారని మీ ముఖాన ఉన్న రంగులు చూసి అప్రమత్తమవుతారు" అంటూ ఎద్దేవా చేశారు.