పది కోట్లను కాదనుకున్న శిల్పాశెట్టిపై మాజీ సీఎం శివరాజ్ సింగ్ ప్రశంసలు
- శిల్పా శెట్టి సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించారు
- పది కోట్ల రూపాయల ఆఫర్‌ను వదిలేసుకున్నారు
- మిగతా సెలబ్రిటీలు కూడా ఆమెను అనుసరించాలి
తాజాగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా స్పందించారు. శిల్ప నిర్ణయం భేష్ అంటూ కొనియాడారు. స్లిమ్మింగ్ పిల్స్ ఫలితాలపై నమ్మకం లేని ఆమె బాధ్యతగా వ్యవహరించి రూ.10 కోట్ల ఆఫర్‌ను వదిలేసుకున్నారని, ఆమె తీరు అభినందనీయమని ప్రశంసించారు. సమాజం పట్ల ఆమెకున్న బాధ్యతకు ఇది నిదర్శనమని కొనియాడారు. మిగతా సెలబ్రిటీలు కూడా ఆమెను అనుసరించాలని కోరారు. అవాస్తవమైన ప్రచారాలకు సెలబ్రిటీలు దూరంగా ఉండాలని, వారు తీసుకునే నిర్ణయం సమాజానికి ఉపయోగపడుతుందని శివరాజ్ సింగ్ పేర్కొన్నారు.