జైలు బయటే కాపుకాసిన విశాఖ పోలీసులు.. బయటకు రాగానే మహిళా సంఘం కార్యకర్త అనూష అరెస్ట్!
- మావోయిస్టులకు సహకరిస్తున్నారని ఆరోపణ
- గతేడాది డిసెంబరులో అక్కాచెల్లెళ్ల అరెస్ట్
- జైలు నుంచి బయటకు రాగానే చెల్లెలు మళ్లీ అరెస్ట్
బెయిలుపై బుధవారం భవానీ, అనూష విడుదల కాగా, అనూషపై మరో కేసు కూడా ఉందని చెప్పిన పోలీసులు అటునుంచి అటే ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అనూష అరెస్ట్‌పై ఏపీ, తెలంగాణ పౌరహక్కుల సంఘాలు స్పందించాయి. చైతన్య మహిళా సంఘం కార్యకర్త అయిన అనూష అరెస్ట్ అక్రమమని, వెంటనే ఆమెను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.