ముఖ్యమంత్రిని చేస్తారో.. ప్రతిపక్షంలో కూర్చోబెడతారో మీ ఇష్టం: పవన్
- చంద్రబాబులా నా కుమారుడిని సీఎం చేయాలనుకోవడం లేదు
- జగన్‌లా 30 ఏళ్లు సీఎం కావాలనుకోవడం లేదు
- వారిద్దరిలా దిగజారి అబద్ధాలు చెప్పను
జనసేన లేకుండా భవిష్యత్ రాజకీయాలు ఉండబోవని కొండారెడ్డి బురుజు సాక్షిగా చెబుతున్నానని పవన్ అన్నారు. ఎప్పుడూ కూడా ఒకే వ్యక్తికి అధికారం ఇస్తే పాలన అస్తవ్యస్తంగా మారుతుందని, అందుకే సంకీర్ణ ప్రభుత్వాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. అధికార, ప్రతిపక్ష నేతల మేనిఫెస్టోలు చూస్తుంటే సిగ్గేస్తోందని పవన్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌కు రెండింతల వరకు హామీలు ఇస్తున్నారని అన్నారు. చంద్రబాబు, జగన్‌లా తాను దిగజారుడు రాజకీయాలు చేయనని, అబద్ధాలు చెప్పబోనని పవన్ స్పష్టం చేశారు.