టీడీపీలోనే నాకు శత్రువులు ఉన్నారు..సీఎంకు తప్పుడు రిపోర్టులు పంపారు!: మంత్రి అఖిలప్రియ
- సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లా
- ఆయన లేకుంటే ఈరోజు నేను లేను
- మీడియాతో మాట్లాడిన ఏపీ మంత్రి
ఏదైనా సమస్య ఉంటే సీఎంతో మాట్లాడి పరిష్కరించుకుంటాననీ, అంతేతప్ప పార్టీని విడిచిపెట్టి పోనని స్పష్టం చేశారు. సొంత పార్టీలోనే తనకు శత్రువులు ఉన్నారని అఖిల ప్రియ బాంబు పేల్చారు. ఈ విషయాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కావాలనే ఆళ్లగడ్డపై చంద్రబాబుకు తప్పుడు రిపోర్టులు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనివెనుక పోలీసులు ఉన్నారా? లేక ఇంటెలిజెన్స్ అధికారులు ఉన్నారా? అన్నది తనకు తెలియదన్నారు. తనను టార్గెట్ చేయాలని చాలామంది చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాను, సోదరుడు బ్రహ్మానంద రెడ్డి తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటున్నందున చంద్రబాబు తమపై చాలా శ్రద్ధ తీసుకుంటున్నారనీ, గైడ్ చేస్తున్నారని పేర్కొన్నారు.