ఇంతటి వరదలకు కారణం అయ్యప్ప స్వామి ఆగ్రహమే... దుమారం రేపుతున్న ప్రముఖుల ట్వీట్లు!
- 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత వరద
- జలవిలయానికి కేరళ అతలాకుతలం
- అయ్యప్ప విషయంలో సుప్రీం జోక్యమే కారణం
- ఆర్బీఐ బోర్డు సభ్యుడితో పాటు ఆర్ఎస్ఎస్ ప్రముఖుడి ట్వీట్
శబరిమల వ్యవహారంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడంతో స్వామికి కోపం వచ్చిందని ఛాందసవాదులు వ్యాఖ్యానిస్తుండగా, వారిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు సభ్యుడితో పాటు ఓ ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు కూడా ఉన్నారు. వీరు చేసిన వ్యాఖ్యలు సరికాదని, వరదలకు, మతపరమైన విషయాలకూ సంబంధం ఏంటని, నిరాశ్రయులైన ప్రజలకు సాయం చేయాలని నెటిజన్లు వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.