వానలకు కేరళ విలవిల.. 18 మంది మృతి!
- కేరళను కుదిపేస్తున్న వర్షాలు
- విరిగిపడుతున్న కొండ చరియలు
- ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. వరద ఉద్ధృతికి వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. వర్షాల కారణంగా ఇడుక్కీ రిజర్వాయర్ నీటి మట్టం పెరగడంతో గురువారం గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు. 26 ఏళ్ల తర్వాత ఈ డ్యామ్ గేట్లు తెరవడం ఇదే తొలిసారి.