సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- లండన్ వెళుతున్న పూజా హెగ్డే
- 'క్వీన్' కోసం పారిస్ లో కాజల్, తమన్నా
- నాగ చైతన్యతో రాహుల్ రవీంద్రన్ సినిమా
* హిందీలో విజయం సాధించిన 'క్వీన్' చిత్రాన్ని దక్షిణాది భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పారిస్ లో జరుగుతోంది. ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ అక్కడ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ 'దటీజ్ మహాలక్ష్మి' కోసం తమన్నా, తమిళ వెర్షన్ షూటింగ్ కోసం కాజల్ ప్రస్తుతం పారిస్ లో ఉన్నారు.
* యువ నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి, సుశాంత్ హీరోగా 'చి.ల.సౌ' పేరిట ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇది సెట్స్ పై ఉండగానే, తన తదుపరి చిత్రాన్ని కూడా రాహుల్ ప్రకటించాడు. అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మించే తదుపరి చిత్రానికి కూడా తాను దర్శకత్వం వహించనున్నట్టు పేర్కొన్నాడు. ఇందులో నాగచైతన్య హీరోగా నటిస్తాడని సమాచారం.