'రౌడీ నాయక్'గా తమిళంలోకి చరణ్ హిట్ మూవీ
- చరణ్ మూవీస్ లో 'నాయక్'కి ప్రత్యేక స్థానం
- తమిళంలోకి అనువాదం
- త్వరలోనే అక్కడ భారీ రిలీజ్
చరణ్ స్టార్ డమ్ ను పెంచేసిన సినిమాల జాబితాలో 'నాయక్' కూడా కనిపిస్తుంది. అలాంటి ఈ సినిమాను కోలీవుడ్ లోకి డబ్ చేస్తున్నారు. 'రౌడీ నాయక్' పేరుతో ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేయనున్నారు. చరణ్ తో పాటు కాజల్ .. అమలా పాల్ కి కూడా తమిళంలో మంచి క్రేజ్ వుంది. అందువలన ఈ సినిమా అక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకోవడం ఖాయమనే సంగతి తెలిసిందే.