మరో కొత్త ఫీచర్‌ను పరిశీలిస్తున్న వాట్సాప్.. డేటాను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం!
- వరుస పెట్టి ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న వాట్సాప్
- మే నుంచి అందుబాటులోకి డౌన్‌లోడ్ ఫీచర్
- ఇప్పటికే ఫేస్‌బుక్‌లో అందుబాటులో..
ఈ ఆప్షన్‌ను ఎంచుకున్న 20 రోజుల తర్వాత తమకు కావాల్సిన డేటా అందుబాటులోకి వస్తుంది. ఈ విషయాన్ని నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన నెలరోజుల్లో డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ డేటా మొత్తం జిప్, సీఎస్‌వీ ఫార్మాట్లలో ఉండే అవకాశం ఉందని సమాచారం. డేటాను ఒక్కసారి డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆటోమెటిక్‌గా డిలీట్ అయిపోతుంది. మళ్లీ కావాలంటే మాత్రం మొదటి నుంచి మొదలెట్టాల్సిందే.