ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న అమెరికన్ నటుడు!
- లైంగిక వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీ ఆరోపణలు
- దోషిగా తేల్చిన జడ్జి
- శిక్ష ఖరారు కాకుండానే ఆత్మహత్య
పలు టీవీ సిరీస్ లలో నటించిన సాలింగ్ కు నటుడిగా మంచి పేరు ఉంది. 2015లో అతనిపై లైంగిక వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు 2016లో ఛార్జ్ షీట్ నమోదు చేశారు. అతని ల్యాప్ టాప్ ను పరిశీలించగా... దాదాపు 50 వేల చైల్డ్ పోర్నోగ్రఫీ ఫొటోలు, వీడియోలు లభించాయి. ఈ నేపథ్యంలో సాలింగ్ ను జడ్జి దోషిగా తేల్చారు. వచ్చే మార్చి 7న ఆయనకు శిక్ష ఖరారు కానుంది. ఈలోగానే సాలింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఆగస్టులో ఆయన ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించి విఫలమయ్యాడు.