టీడీపీ వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియో.. గుర్రుగా అధిష్ఠానం.. చర్యలకు సిద్ధం!
- అభ్యంతరకర వీడియోను పోస్టు చేసిన మునిసిపల్ వైస్ చైర్మన్
- ఆయన తీరుతో పార్టీ పరువు పోయిందన్న నేతలు
- చర్యలు తీసుకోవాలని డిమాండ్
- పరిశీలిస్తున్న అధిష్ఠానం
వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియోను పోస్టు చేసిన రాజుపై చర్యలు తీసుకోవాలంటూ పెద్దాపురం టీడీపీ నేతలు, కార్యకర్తలు అధిష్ఠానాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆయనను సస్పెండ్ చేయాలని కోరారు. పలువురు పెద్దలు, ముఖ్యనాయకులు ఉండే ఈ గ్రూపులో అభ్యంతరకర వీడియోను ఎలా పోస్టు చేస్తారని రాజును నిలదీశారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చారని మండిపడుతున్నారు. రాజు వ్యవహారంపై అధిష్ఠానం కూడా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. రేపో, మాపో ఆయనపై చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం.