పరువు నష్టం దావా వేస్తా... గాలి ముద్దుకృష్ణమనాయుడుపై మండిపడ్డ ఎమ్మెల్యే రోజా!
- కలెక్టర్‌తో కలిసి హంద్రీనీవా ప్రాజెక్ట్ అలైన్‌మెంట్ మార్చానని ఆరోపించారు
- ఆధారాలు చూపకపోతే పరువునష్టం దావా వేస్తా
- ముద్దుకృష్ణమనాయుడు తిరుమల దర్శనం టికెట్లు కూడా అమ్ముకుంటారు
తాను సినిమాల్లో హీరోయిన్‌గా దాదాపు 150 సినిమాల్లో నటించానని, నిజాయతీగా డబ్బు సంపాదించానని రోజా ఉద్ఘాటించారు. అంతేకానీ, సూట్ కేసు చేతిలో పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి కోట్లాది రూపాయలు సంపాదించలేదని అన్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు తిరుమల దర్శనం టికెట్లు కూడా అమ్ముకుంటారని రోజా ఆరోపించారు. ఆయన అనుచరులు పలుసార్లు దోపిడీకి పాల్పడ్డారని అన్నారు.