సీనియర్ నటుడు నారాయణరావు అంత్యక్రియలు పూర్తి

Senior actor GV Narayana Rao funeral rites completed
  • బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచిన నారాయణరావు
  • అమెరికా నుంచి వచ్చిన కొడుకు, కుమార్తె 
  • జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు
ప్రముఖ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు (73) అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంతిమ సంస్కారాలు శాస్త్రోక్తంగా జరిగాయి. విదేశాల నుంచి వచ్చిన ఆయన కుమారుడు, కుమార్తె ఈ కార్యక్రమాలు పూర్తి చేశారు.

అంతకుముందు, పలువురు సినీ ప్రముఖులు జీవీ నారాయణరావు భౌతికకాయానికి నివాళులర్పించారు. మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ నటుడు మురళీ మోహన్‌తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జీవీ నారాయణరావు బుధవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే.

1976లో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన 'అంతులేని కథ' చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన జీవీ, ఆ తర్వాత ఎన్నో చిత్రాలు, టీవీ సీరియళ్లలో విలక్షణ పాత్రలు పోషించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు.



Advertisement
GV Narayana Rao
GV Narayana Rao funeral
Telugu actor death
Tollywood producer GV Narayana Rao
Jubilee Hills Mahaprasthanam
Anthuleni Katha actor

More Telugu News