రాఖీ పండుగ రోజున రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్
- రాఖీ పండుగ రోజున సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌తో కొత్త చర్చ
- ప్రధాని మోదీ, యోగి, టాటా, కలాం వంటి వారిని ఉదాహరణగా ప్రస్తావన
- ఆర్జీవీ చేసిన పోస్ట్‌పై నెట్టింట భిన్నాభిప్రాయాలు, వైరల్ అవుతున్న పోస్ట్
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు తెరలేపారు. పండుగ ఏదైనా, సందర్భం ఏదైనా తన మార్క్ వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే వర్మ, ఈసారి రాఖీ పండుగను వేదికగా చేసుకున్నారు. "విజయవంతమైన ప్రతి పురుషుడి వెనుక ఓ స్త్రీ ఉంటుంది" అనే నానుడికి వ్యతిరేకంగా ఆయన చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
"Behind every successful MAN there’s NO WOMAN (wife)" (విజయవంతమైన ప్రతి పురుషుడి వెనుక స్త్రీ (భార్య) ఉండదు) అంటూ వర్మ ఓ పోస్ట్ పెట్టారు. తన వాదనకు బలం చేకూర్చేందుకు, పెళ్లి చేసుకోకుండా విజయవంతమైన జీవితాన్ని గడుపుతున్న కొందరు ప్రముఖుల జాబితాను కూడా ఆయన జతచేశారు. ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, నటుడు సల్మాన్ ఖాన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, యోగా గురువు బాబా రాందేవ్‌ల పేర్లను ఆయన ఉదహరించారు. వీరంతా అవివాహితులేనని (Still Single) వర్మ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.