వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు కొత్త సదుపాయాలు... త్వరలో ప్రవేశపెట్టనున్న యాప్
- గ్రూప్ సభ్యుల పోస్టులను కట్టడి చేసే హక్కు
- 'రెస్ట్రిక్టెడ్ గ్రూప్స్' పేరుతో అందుబాటులోకి
- నియంత్రణకు గురైన వారు పోస్ట్ చేయాలంటే అడ్మిన్‌ని సంప్రదించాల్సిందే
ఒకవేళ నియంత్రణకు గురైన సభ్యులు ఏదైనా పోస్టు పెట్టాలనుకుంటే 'మెసేజ్ అడ్మిన్' అనే సదుపాయం ద్వారా అడ్మిన్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. వారి మెసేజ్‌ని అడ్మిన్ చూసి, ఆమోదిస్తేనే గ్రూప్‌లో పోస్ట్ అవుతుంది. ఈ ఫీచర్ వల్ల గ్రూపుకి సంబంధంలేని పోస్టులు చేసే వారిని నియంత్రించవచ్చు. త్వరలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.