అమెరికాలో రూ.కోటి.. భారత్‌లో రూ.25 లక్షల జీతం.. ఎక్కడ ఎక్కువ పొదుపు చేయొచ్చు? ఎన్‌ఆర్‌ఐ ఆసక్తికర లెక్కలు!
- అమెరికాలో కోటి జీతం ఉన్నా ఖర్చులూ ఎక్కువేనన్న నితిన్ మల్హోత్రా
- భారత్‌లో రూ.25 లక్షలు సంపాదించినప్పుడే ఎక్కువ ఆదా చేశామన్న ఎన్‌ఆర్‌ఐ
- భార్య ఉద్యోగంలో చేరితే పిల్లల డేకేర్ ఖర్చులూ చేరతాయని వెల్లడి
- నితిన్ వ్యాఖ్యలపై నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
- భార్య కూడా ఉద్యోగం చేస్తే ఎక్కువ ఆదా చేసుకోవచ్చని కామెంట్స్
అమెరికాలో ఏడాదికి దాదాపు రూ.1 కోటి సంపాదిస్తున్న ఓ భారతీయుడు.. ఇండియాలో రూ.25 లక్షల వార్షిక వేతనం ఉన్నప్పుడే తాను ఎక్కువ డబ్బు ఆదా చేసేవాడినని చెప్పడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 15 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న నితిన్ మల్హోత్రా తన ఆదాయం, ఖర్చుల వివరాలను వీడియోలో పంచుకున్నారు.
నితిన్ మల్హోత్రా ప్రకారం.. అమెరికాలో నెలకు సుమారు 8,000 డాలర్లు (రూ.7.63 లక్షలు) సంపాదిస్తున్నారు. ఇందులో దాదాపు 2,500 డాలర్లు లోన్‌కు, మరో 1,500 డాలర్లు పన్నులకు వెళ్తున్నాయి. దీంతో చేతిలో సుమారు 4,000 డాలర్లు మిగులుతున్నాయి.
జీతం భారీగానే ఉన్నా..
రెండు కార్లకు ఇన్సూరెన్స్ కోసం నెలకు సుమారు 500 డాలర్లు, తనకు, భార్యకు, కుమారుడికి ఆరోగ్య బీమా కోసం మరో 500 డాలర్లు ఖర్చవుతున్నాయని నితిన్ తెలిపారు. కుటుంబ ఆహార ఖర్చులు నెలకు 1,000 నుంచి 1,200 డాలర్ల వరకు ఉంటాయని చెప్పారు.
మెడికల్ బిల్లులు, మందులు తదితర ఇతర ఖర్చులకు మరో 500 నుంచి 800 డాలర్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఫోన్, ఇంటర్నెట్ బిల్లులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. వీటన్నింటినీ కలిపిన తర్వాత నెలకు తనకు సుమారు 1,000 నుంచి 1,200 డాలర్లు మాత్రమే మిగులుతున్నాయని చెప్పారు.
భార్య ప్రస్తుతం ఉద్యోగం చేయడం లేదని, ఆమె ఉద్యోగంలో చేరితే పిల్లల డేకేర్ తదితర ఖర్చులు కూడా అదనంగా వస్తాయని నితిన్ పేర్కొన్నారు.
ఇండియాలో ఎంత ఆదా చేశారంటే?
అమెరికాతో పోలిస్తే ఇండియాలో తన ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండేదని నితిన్ చెప్పారు. భారత్‌లో ఏడాదికి సుమారు రూ.25 లక్షల వేతనం పొందుతున్న సమయంలో నెలకు రూ.30 వేల వరకు అద్దె చెల్లించేవాడినని తెలిపారు.
రోజువారీ ఖర్చులు కూడా అమెరికాతో పోలిస్తే తక్కువగా ఉండటంతో నెలకు రూ.1 లక్ష నుంచి రూ.1.25 లక్షల వరకు సులభంగా ఆదా చేసేవాడినని ఆయన చెప్పారు.
దీంతో అమెరికాలో ఎక్కువ జీతం వస్తున్నప్పటికీ.. అధిక జీవన వ్యయం కారణంగా చేతిలో మిగిలే మొత్తం భారత్‌లో కంటే తక్కువగా ఉందన్నది ఆయన వాదన.
అమెరికాలో జీతం ఎక్కువ.. కానీ
నితిన్ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అమెరికాలో జీవన ప్రమాణాలు, మౌలిక వసతులు, అత్యవసర సేవలు మెరుగ్గా ఉన్నప్పటికీ.. ఉద్యోగం కోల్పోతే పరిస్థితి కష్టంగా మారుతుందని ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు.
మరో నెటిజన్ మాత్రం భార్య కూడా ఉద్యోగం చేస్తే కుటుంబం మరింత ఎక్కువగా ఆదా చేయగలదని అభిప్రాయపడ్డారు.

More Telugu News
నిజ జీవితంలో విజయ్ హీరో కాదు, విలన్: టీటీవీ దినకరన్ తీవ్ర వ్యాఖ్యలు
![]()
80ల లుక్ కోసం ఫొటో అప్లోడ్ చేస్తున్నారా? ఈ రిస్క్‌లు మాత్రం మర్చిపోవద్దు!
![]()
భారత్‌లో ఐఫోన్ ధరలు ఎందుకు తగ్గవు? అసలు కారణం ఇదే!
![]()
ప్రియాంక గాంధీ ఫేక్ వీడియోలు.. వాటిలో పెట్టుబడులు పెట్టొద్దంటూ ఆఫీస్ హెచ్చరిక
![]()
90 ఎంఎల్ వేసుకుని ఆ ఫేక్ అకౌంట్ సృష్టించారా?: రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
![]()
ఎంత పగ.. అతడు చనిపోయినా ట్రోలింగ్ ఆగలేదు.. ఎవరీ జిజో జాన్ పుతెన్‌జెత్?
![]()
సాక్షాత్తు సీఎం సొంత ఊరిలోనే ఈ దుస్థితా?: కేటీఆర్
![]()
దుష్ప్రచారాలు నమ్మొద్దు: గణేశ్ నిమజ్జనాలపై హైడ్రా చీఫ్ రంగనాథ్
![]()
పూజా హెగ్డే ఇంట 'గ్రీన్ గణపతి'.. ప్రత్యేకత ఇదే!
![]()
మూడు రోజుల నష్టాలకు బ్రేక్.. బ్యాంకింగ్ షేర్ల అండతో లాభాల్లో మార్కెట్లు
![]()
'సర్దార్ 2' - మూవీ రివ్యూ!
![]()
తుమ్మల నాగేశ్వరరావు పనితీరు, వ్యక్తిత్వంపై బీజేపీ ఎమ్మెల్యేల ప్రశంసలు
![]()
‘టీమిండియాకు దూరమైన తర్వాత ఆకలి పెరిగింది’.. దులీప్ ట్రోఫీ విజయం తర్వాత ఇషాన్
![]()
మనం సృష్టించిన మేధస్సు.. మనల్నే మింగేస్తే? ఏఐపై ఎందుకీ దిగ్గజాల హెచ్చరికలు?
![]()
ఏపీ మద్యం కేసులో రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
![]()