ఖాళీ కడుపుతో వర్కౌట్స్ చేస్తే కొవ్వు వేగంగా కరుగుతుందా?
- ఫాస్టెడ్ వర్కౌట్‌లో కొవ్వు వినియోగం పెరిగే ఛాన్స్
- దీంతో ఎక్కువ బరువు తగ్గుతారని మాత్రం చెప్పలేమంటున్న నిపుణులు
- తేలికపాటి వ్యాయామానికి ఖాళీ కడుపుతో ఇబ్బంది లేదని వివరణ
- హెవీ వర్కౌట్‌కు శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుందని వెల్లడి
- అలాంటప్పుడు అరటిపండు వంటి తేలికపాటి ఆహారం తీసుకోవాలని సూచన
ఉదయం లేవగానే ఏమీ తినకుండా జిమ్‌కు వెళ్లేవాళ్లు చాలామందే. ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే కొవ్వు వేగంగా కరిగిపోతుందని నమ్ముతుంటారు. కానీ వర్కౌట్ సమయంలో ఎక్కువ కొవ్వు ఖర్చవడం, దీర్ఘకాలంలో ఎక్కువ బరువు తగ్గడం రెండూ ఒకటి కాదు. మరి ఫాస్టెడ్ వర్కౌట్ ఎప్పుడు మంచిది.. ఎప్పుడు ఇబ్బందిగా మారుతుంది?
తేలికపాటి వ్యాయామానికి ఓకే
రాత్రంతా 8-10 గంటలు ఆహారం తీసుకోకపోవడంతో ఉదయం శరీరంలో నిల్వ ఉన్న గ్లైకోజెన్ కొంత తగ్గి, ఇన్సులిన్ స్థాయులు తక్కువగా ఉంటాయి. దీంతో తేలికపాటి నడక, జాగింగ్, సైక్లింగ్, యోగా వంటి వ్యాయామాల్లో శరీరం కొవ్వును ఎక్కువగా శక్తిగా ఉపయోగించుకుంటుంది. అయితే దీనివల్ల రోజంతా ఎక్కువ కొవ్వు కరిగిపోతుందని కాదు. బరువు తగ్గడంలో మొత్తం రోజువారీ కేలరీల సమతుల్యతే కీలకం.
హెవీ వర్కౌట్ అయితే తినడం మంచిది
వెయిట్ లిఫ్టింగ్, పవర్‌లిఫ్టింగ్, గంటకు పైగా సాగే పరుగుల వంటి అధిక తీవ్రత వ్యాయామాలకు శరీరానికి వేగంగా అందే శక్తి అవసరం. ఖాళీ కడుపుతో చేస్తే అలసట త్వరగా రావడం, పనితీరు తగ్గడం, వ్యాయామం చేసే విధానం దెబ్బతిని గాయాల ప్రమాదం పెరగడం వంటి సమస్యలు రావొచ్చు. కొందరికి రక్తంలో చక్కెర తగ్గి తల తిరగడం, వికారం, నీరసం కూడా కలగొచ్చు. అలాంటి వారు వర్కౌట్‌కు 30-45 నిమిషాల ముందు అరటిపండు వంటి తేలికపాటి కార్బోహైడ్రేట్ ఆహారం తీసుకోవడం మంచిది.
మీ శరీరం ఎలా స్పందిస్తుందో ముఖ్యం
ఆరోగ్యంగా ఉన్నవారికి తేలికపాటి ఉదయపు వ్యాయామాన్ని ఖాళీ కడుపుతో చేయడం సాధారణంగా సురక్షితమే. కానీ అందరికీ ఇదే విధానం సరిపోదు. నిద్ర సరిగా లేకపోవడం, ఒత్తిడి ఎక్కువగా ఉండటం లేదా వ్యాయామం సమయంలో అసౌకర్యం కలగడం వంటి పరిస్థితుల్లో జాగ్రత్త అవసరం. ఖాళీ కడుపుతో వర్కౌట్ చేయడం బరువు తగ్గడానికి తప్పనిసరి మార్గం కాదు. మీ వ్యాయామ తీవ్రత, శరీర స్పందన, మొత్తం ఆహారపు అలవాట్లను బట్టి నిర్ణయం తీసుకోవాలి.