రణ్‌వీర్ సింగ్‌కు ఎవరూ సహకరించవద్దు.. ఫిల్మ్ ఫెడరేషన్ కీలక ఆదేశాలు
- డాన్ 3 నుంచి తప్పుకున్న రణ్‌వీర్ సింగ్‌కు షాక్
- రూ.45 కోట్ల నష్టం వాటిల్లిందంటూ ఫర్హాన్ అక్తర్ ఫిర్యాదు
- రణ్‌వీర్‌పై సహాయ నిరాకరణ ఆదేశాలు జారీ చేసిన ఎఫ్ డబ్ల్యూఐసీఈ
- ఇది చట్టపరమైన అంశమని, ఫెడరేషన్ జోక్యం సరికాదన్న రణ్‌వీర్
- చర్చలకు తాము సిద్ధమేనని స్పష్టం చేసిన ఫెడరేషన్
బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్‌వీర్ సింగ్ ఓ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ప్రతిష్టాత్మక 'డాన్ 3' సినిమా నుంచి ఆయన ఆఖరి నిమిషంలో తప్పుకోవడంతో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్ డబ్ల్యూఐసీఈ) ఆయనపై సహాయ నిరాకరణ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఫెడరేషన్‌కు చెందిన ఏ సభ్యుడు కూడా రణ్‌వీర్‌తో కలిసి పనిచేయకూడదు.
సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు రణ్‌వీర్ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు. దీంతో తమకు ప్రీ-ప్రొడక్షన్ పనుల రూపంలో సుమారు రూ.45 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని దర్శకుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్ ఫెడరేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫర్హాన్ ఫిర్యాదు అనంతరం, వివరణ ఇచ్చేందుకు తమ ముందు హాజరుకావాలని రణ్‌వీర్‌కు ఫెడరేషన్ పలుమార్లు సమాచారం పంపింది.
అయితే, ఇది ఇరు పక్షాల మధ్య ఒప్పందానికి సంబంధించిన విషయమని, దీనిపై చట్టపరమైన ఫోరంలోనే తేల్చుకోవాలని, ఎఫ్ డబ్ల్యూఐసీఈ సరైన వేదిక కాదని రణ్‌వీర్ వర్గం బదులిచ్చింది. దీంతో రణ్‌వీర్ ప్రవర్తన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఫెడరేషన్, ఈ సహాయ నిరాకరణ ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో, తాను తీసుకున్న రూ.10 కోట్ల అడ్వాన్స్‌ను తిరిగి ఇస్తానని, నష్టాన్ని పూడ్చేందుకు తన తర్వాతి సినిమా 'ప్రళయ్'లో వాటా ఇస్తానని రణ్‌వీర్ ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను నిర్మాణ సంస్థ వర్గాలు ఖండించాయి. కాగా, ఈ సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం కోసం రణ్‌వీర్‌తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎఫ్ డబ్ల్యూఐసీఈ ఒక ప్రకటనలో పేర్కొంది.