భారత్ లో రియల్ ఎస్టేట్ కింగ్స్ వీళ్లే... ఫోర్బ్స్ లిస్టులో మై హోమ్ రామేశ్వర్ రావు
- ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితాలో 13 మంది భారత రియల్ ఎస్టేట్ దిగ్గజాలు
- రూ. 1.21 లక్షల కోట్ల సంపదతో డీఎల్‌ఎఫ్ ఛైర్మన్ కేపీ సింగ్ అగ్రస్థానం
- ఈ జాబితాలో మై హోమ్ గ్రూప్ అధినేత జె. రామేశ్వర్ రావుకు స్థానం
- లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరగడమే వీరి సంపదకు కారణమని విశ్లేషణ
- రియల్ ఎస్టేట్ డీళ్ల సంఖ్య పెరిగినా, వాటి విలువ గణనీయంగా తగ్గింది
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, రామేశ్వర్ రావు ఆస్తి విలువ సుమారు $2.3 బిలియన్లుగా (సుమారు ₹22,011 కోట్లు ) ఉంది. గతేడాది ($2.4 బిలియన్)తో పోలిస్తే ఆయన సంపద స్వల్పంగా తగ్గినా, భారత రియల్టీ బిలియనీర్ల జాబితాలో ఆయన 6వ స్థానంలో నిలిచారు. కాగా, ఫోర్బ్స్ అధికారిక ప్రొఫైల్‌లో ఆయన నికర ఆస్తి విలువ $2.2 బిలియన్లుగా నమోదైంది.
1981లో 'మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్' సంస్థను స్థాపించిన రామేశ్వర్ రావు, హైదరాబాద్ కేంద్రంగా రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులతో అనతికాలంలోనే గుర్తింపు పొందారు. ఆ తర్వాత సిమెంట్ (మహా సిమెంట్), మీడియా (టీవీ9లో వాటా) వంటి రంగాల్లోనూ వ్యాపారాన్ని విస్తరించి, సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా ఎదిగారు.
ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో రికార్డు స్థాయిలో భారతీయులు చోటు దక్కించుకోవడం విశేషం. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే భారత రియల్టీ వ్యాపారులు తమ సంపదను కాపాడుకోగలిగారని ఫోర్బ్స్ ఇండియా విశ్లేషించింది.
భారతదేశపు రియల్ ఎస్టేట్ బిలియనీర్లు
| పేరు (Name) | సంస్థ / హోదా (Company / Designation) | గ్లోబల్ ర్యాంక్ (Global Rank) | 2025 నికర విలువ (బిలియన్ డాలర్లలో) | 2026 నికర విలువ (బిలియన్ డాలర్లలో) | 2026 నికర విలువ (భారతీయ రూపాయలు - ₹ కోట్లలో)* |
| కుశాల్ పాల్ సింగ్ | మాజీ ఛైర్మన్ మరియు CEO, DLF | 237 | $14.5 | $12.7 | ₹1,21,539 కోట్లు |
| మంగళ్ ప్రభాత్ లోధా | వ్యవస్థాపకుడు, లోధా గ్రూప్ | 684 | $9.5 | $6.1 | ₹58,377 కోట్లు |
| చంద్రు రహేజా | ఛైర్మన్, K రహేజా కార్ప్ | 806 | $4.9 | $5.3 | ₹50,721 కోట్లు |
| వికాస్ ఒబెరాయ్ | ఛైర్మన్ & MD, ఒబెరాయ్ రియల్టీ | 908 | $4.7 | $4.7 | ₹44,979 కోట్లు |
| అతుల్ రుయా | ఛైర్మన్, ఫోనిక్స్ మిల్స్ | 1,611 | $2.6 | $2.6 | ₹24,882 కోట్లు |
| జె. రామేశ్వర్ రావు | వ్యవస్థాపకుడు & ఛైర్మన్, మై హోమ్ గ్రూప్ | 1,834 | $2.4 | $2.3 | ₹22,011 కోట్లు |
| జితేంద్ర విర్వాణి | ఛైర్మన్ & MD, ఎంబసీ గ్రూప్ | 1,913 | $2.7 | $2.2 | ₹21,054 కోట్లు |
| కబీర్ ముల్చందానీ | ఛైర్మన్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఫైవ్ హోల్డింగ్స్ | 1,913 | $2.2 | $2.2 | ₹21,054 కోట్లు |
| మొఫత్‌రాజ్ మునోత్ | వ్యవస్థాపకుడు, కల్పతరు | 2,600 | $1.3 | $1.5 | ₹14,355 కోట్లు |
| రెజ్వాన్, ఇర్ఫాన్ మరియు నోమన్ రజాక్ | ప్రెస్టీజ్ ఎస్టేట్స్ | 2,712 | $1.2 | $1.4 | ₹13,398 కోట్లు |