Advertisement

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఫలితాలపై 'టుడేస్ చాణక్య' ఏం చెప్పిందంటే?

Todays Chanakya forecasts BJP sweep in Bengal
  • నేడు విడుదలైన టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
  • తమిళనాడులో డీఎంకే, బెంగాల్‌లో బీజేపీ గెలుస్తుందని అంచనా
  • తమిళనాడులో విజయ్ పార్టీ రెండో స్థానంలోకి రావొచ్చన్న టుడేస్ చాణక్య
పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్‌ను టుడేస్ చాణక్య ఈరోజు విడుదల చేసింది. దాదాపు అన్నీ సర్వేలు నిన్న విడుదలయ్యాయి. తమిళనాడులో డీఎంకే, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందని మెజార్టీ సర్వేలు అంచనా వేశాయి. ఈరోజు విడుదలైన టుడేస్ చాణక్య కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది.

తమిళనాడులో 234 స్థానాలకు గాను డీఎంకేకు 125 స్థానాలు రావొచ్చని అంచనా వేసింది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి 65, అన్నాడీఎంకే కూటమికి 45 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. యాక్సిస్ మై ఇండియా మినహాయించి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా అన్నాడీఎంకే రెండో స్థానంలో ఉంటుందని అంచనా వేయగా, టుడేస్ చాణక్య మాత్రం టీవీకే పార్టీ రెండో స్థానంలో నిలుస్తుందని అభిప్రాయపడింది. ఓటింగ్ శాతం చూసుకుంటే, డీఎంకేకు 39 శాతం, టీవీకేకు 30 శాతం, అన్నాడీఎంకే కూటమికి 27 శాతం ఓట్లు రావొచ్చని తెలిపింది.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ పాగా వేసే అవకాశాలు ఉన్నాయని టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ తెలిపింది. 294 స్థానాలకు గాను బీజేపీ 192, తృణమూల్ కాంగ్రెస్ 100 రావొచ్చని పేర్కొంది. బీజేపీకి 48 శాతం, టీఎంసీకి 38 శాతం ఓట్లు రావొచ్చని అంచనా వేసింది.

కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటమి మధ్య హోరాహోరీ కనిపిస్తున్నప్పటికీ, యూడీఎఫ్ కాస్త ముందుండే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది. అసోంలో బీజేపీ 102 సీట్లు, 50 శాతం ఓట్లతో అద్భత విజయం అందుకోబోతుందని ఈ సర్వే ఫలితాలు అంచనా వేస్తున్నాయి.
Advertisement
Todays Chanakya forecasts BJP sweep in Bengal
Exit Poll Survey

More Telugu News