Advertisement

‘టాక్సిక్’లో అవేం సీన్లు.. మధ్యలోనే బయటకు వచ్చేశా: రాజాసింగ్‌ ఫైర్‌

Raja Singh slams Toxic movie for obscene scenes and walks out midway
  • ‘టాక్సిక్‌’పై రాజాసింగ్‌ తీవ్ర విమర్శలు
  • సినిమాలో అశ్లీలత, హింసపై అభ్యంతరం
  • మధ్యలోనే థియేటర్‌ నుంచి వచ్చేశానని వెల్లడి
  • మంచి సందేశాత్మక సినిమాలు తీయాలని సూచన
  • ‘ఇరుముడి’, ‘ఛావా’ చిత్రాలను ప్రశంసించిన రాజాసింగ్‌
యశ్‌ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్‌’ ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్ర విమర్శలు చేశారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదేం అశ్లీలత అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

సినీ పరిశ్రమ సమాజానికి ఉపయోగపడే మంచి సందేశాత్మక చిత్రాలు తీయాలని రాజాసింగ్‌ సూచించారు. దర్శకులు హింస, అశ్లీలతను మాత్రమే నమ్ముకోకుండా సమాజాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. ధర్మం, భక్తి పెంపొందించేలా సినిమాలు రూపొందించాలని పిలుపునిచ్చారు.

టాక్సిక్‌ సినిమా చూడటానికి తాను థియేటర్‌కు వెళ్లానని రాజాసింగ్‌ తెలిపారు. అయితే సినిమాలోని అశ్లీలత, తీవ్ర హింసను భరించలేక మధ్యలోనే బయటకు వచ్చేశానని చెప్పారు. యశ్‌ వంటి అగ్ర కథానాయకులు కుటుంబంతో కలిసి చూసేలా మంచి సినిమాలు చేయాలని సూచించారు.

సమాజంలో ధర్మం, భక్తి, బాధ్యత పెంచే చిత్రాలు అవసరమని రాజాసింగ్‌ అన్నారు. ఇటీవల విడుదలైన ‘ఇరుముడి’, ‘ఛావా’ సినిమాలను ఆయన ఉదాహరణగా చెప్పారు. ‘ఇరుముడి’లో ఆధ్యాత్మికత, సామాజిక బాధ్యత కనిపిస్తాయని ప్రశంసించారు. ‘ఛావా’లో ధైర్యం, దేశభక్తి వంటి అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ‘టాక్సిక్‌’ విడుదలైన తొలిరోజే నెగెటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయినప్పటికీ వసూళ్ల పరంగా సినిమా మంచి ఫలితాలు సాధిస్తుండటం గమనార్హం.
Advertisement
Raja Singh
Toxic Movie
Yash
Geethu Mohandas
Goshamahal MLA
Toxic Movie Controversy

More Telugu News