Advertisement

రేవంత్‌ క్యాబినెట్‌లో మంత్రులకు స్వేచ్ఛ లేదా? కూనంనేని సంచలన వ్యాఖ్యలు

Kunamneni Sambasiva Rao sensational comments on Revanth Reddy cabinet ministers freedom
  • మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలన్న కూనంనేని
  • స్వేచ్ఛ లేకపోతే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరిక
  • సీఎంపై వ్యక్తిగత విమర్శలు సరికాదని కొండా సుస్మితకు సూచన
  • రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు ఉండాలన్న కూనంనేని
  • కోటి ఎకరాల భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని వెల్లడి
తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌లో మంత్రులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ లేదని అన్నారు. మంత్రులు తమ శాఖలపై పూర్తి అధికారం, హక్కులతో పనిచేసే అవకాశం కల్పించాలని సూచించారు. వారికి తగిన స్వేచ్ఛ ఇవ్వకపోతే రానున్న రోజుల్లో కొత్త సమస్యలు తెరపైకి వచ్చి ప్రభుత్వం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను కూనంనేని తప్పుబట్టారు. రాజకీయాల్లో విధానాలపై విమర్శలు చేయడం సహజమేనని అన్నారు. అయితే ముఖ్యమంత్రిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో భూ సమస్యలపైనా కూనంనేని ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు కోటి ఎకరాల భూములను నిషేధిత జాబితాలో పెట్టడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం అలసత్వంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. సమస్య తీవ్రతను గుర్తించి వెంటనే పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు.

నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.
Advertisement
Kunamneni Sambasiva Rao
Revanth Reddy
Telangana Cabinet
CPI Telangana
Telangana Land Issues
Telangana Politics

More Telugu News