"విడాకులు తీసుకున్న 37 ఏళ్ల వ్యక్తికి బ్రాహ్మణ 'కన్య' కావలెను"... సోషల్ మీడియాలో దుమారం!
- విడాకులిచ్చిన ఐఐటీయన్‌కు వర్జిన్ వధువు కావాలన్న డిమాండ్
- 37 ఏళ్ల వ్యక్తికి 30లోపు బ్రాహ్మణ కన్య కోసం వెతుకులాట
- నేను మగాడిని అంటూ తనను సమర్థించుకున్న వ్యక్తి
- విషయాన్ని బయటపెట్టిన మ్యాచ్‌మేకర్.. నెట్టింట తీవ్ర విమర్శలు
సాధారణంగా పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ కొన్ని అంచనాలు పెట్టుకుంటారు. కానీ, 37 ఏళ్ల వయసులో విడాకులు తీసుకున్న ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్.. తనకు కాబోయే భార్య కన్య అయి ఉండాలంటూ పెట్టిన కండిషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. భారత వివాహ వ్యవస్థలోని ద్వంద్వనీతి ఇంకెన్నాళ్లు? అంటూ నెటిజన్లు మండిపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. 37 ఏళ్ల వయసున్న, విడాకులు తీసుకున్న ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్ పెళ్లి కోసం మ్యాచ్‌మేకర్ ఒండ్రిలా కపూర్‌ను సంప్రదించాడు. అతను ఒక బిలియన్ డాలర్ల కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. తనకు కాబోయే భార్యకు ఉండాల్సిన అర్హతలను ఇలా వివరించాడు: వయసు 30 ఏళ్ల లోపు ఉండాలి, బ్రాహ్మణ వర్గానికి చెంది ఉండాలి, ఇంతకు ముందు ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో ఉండకూడదు, పెళ్లికాని యువతి, ముఖ్యంగా వర్జిన్ (కన్య) అయి ఉండాలని స్పష్టం చేశాడు.
ఈ డిమాండ్లు విన్న మ్యాచ్‌మేకర్ ఒండ్రిలా, "మీకు విడాకులయ్యాయి కదా, మరి ఈ లాజిక్ మీకు వర్తించదా?" అని ప్రశ్నించింది. దానికి అతను, "ఇది సరైన పోలిక కాదు. ఎందుకంటే నేను పురుషుడిని" అని సమాధానమిచ్చాడు. ఈ సంభాషణను ఒండ్రిలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ 10 లక్షలకు పైగా వ్యూస్ సాధించి, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
"అతను ఎందుకు విడాకులు తీసుకున్నాడో ఇప్పుడు అర్థమవుతోంది", "విడాకులైన వాళ్లు విడాకులైన వాళ్లనే వెతకాలి" అంటూ నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడ్డారు. ఒండ్రిలా కూడా అతని ప్రొఫైల్‌ను తిరస్కరిస్తూ, "నువ్వు మహిళలను కించపరుస్తున్నావు, ఇది నీ కపటత్వం" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కొందరు పురుషులు అతన్ని సమర్థించినప్పటికీ, ఎక్కువ మంది ఈ డిమాండ్లను అవాస్తవికం, పితృస్వామ్య ధోరణి అని విమర్శించారు.