కొడుకుపైనే తల్లి క్రిమినల్ కేసు.. యూపీలో సంచలనం

Uttar Pradesh Crime Mother Files Police Complaint Against Son for Raping Niece
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ఒక తల్లి తన కన్న కొడుకుపైనే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడి, ఆమె గర్భవతి కావడానికి కారణమయ్యాడని ఆరోపిస్తూ ఆమె ఈ ఫిర్యాదు చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భితౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. తండ్రికి చెడు అలవాట్లు ఉండటంతో, బాగోగులు చూసేవారు లేక తన మేనత్త (నిందితుడి తల్లి) ఇంట్లోనే ఉంటూ పెరిగింది. అయితే, ఇదే అదనుగా భావించిన ఆమె కుమారుడు, బాలికను మాయమాటలతో లోబర్చుకుని శారీరక సంబంధం పెట్టుకున్నాడు.

ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు భయపడుతూనే జరిగిన దారుణాన్ని తన అత్తకు వివరించింది. మేనకోడలికి జరిగిన అన్యాయం తెలుసుకుని ఆ మహిళ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కన్న కొడుకని కూడా చూడకుండా, బాధితురాలికి న్యాయం చేయాలని నిర్ణయించుకుని నేరుగా పోలీసులను ఆశ్రయించింది.

ఆమె ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
Go Back to Shorts
Uttar Pradesh Crime
Maharajganj
Rape Case
Incest
Police Complaint
Minor Girl
Pregnancy
Crime News India

More Telugu News