Pakistan: పాకిస్థాన్‌లో దొంగల హల్‌చల్... జాతీయ రహదారుల్లోని సీసీటీవీ కెమెరాల చోరీ
పాకిస్థాన్‌లోని సింధ్, పంజాబ్ రాష్ట్రాల మధ్య ఉన్నరహదారులపై ఇదివరకు ప్రజలను దోచుకున్న ఘటనలు వెలుగుచూసేవి. కానీ ఇప్పుడు ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలు, ఇతర వస్తువులు చోరీకి గురవుతున్నాయి. సింధ్‌లోని సుక్కూర్ నుంచి పంజాబ్ రాష్ట్రంలోని రహీమ్ యార్ ఖాన్ వరకు ఉన్న సుక్కూర్-ముల్తాన్ హైవేలోని 200 కిలోమీటర్ల ప్రాంతం కెమెరా దొంగల కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతోంది.
ఈ ప్రాంతంలోని దొంగలు నిఘా కెమెరాలు, స్పీడ్ కెమెరాలు, సోలార్ ప్యానళ్లు, లైట్లు, ఇతర ఉపకరణాలు, స్థంభాలను దొంగిలిస్తున్నారని ఒక అధికారి తెలిపారు. దొంగలు సోలార్ రిఫ్లెక్టర్లను ధ్వంసం చేశారని, వీధి దీపాలను ఆర్పివేసి తమ కార్యకలాపాలను సాగిస్తున్నారని వెల్లడించారు. నిఘా, స్పీడ్ కెమెరాలను మాయం చేయడంతో ఈ జాతీయ రహదారిపై భద్రతను పర్యవేక్షించడానికి, వేగ పరిమితులను అమలు చేయడానికి ఆటంకంగా మారుతోందని చెప్పారు.