Hyped Samvadini: హైప్డ్ సంవాదిని... వాట్సాప్‌కు పోటీగా దేశీయ యాప్

Hyped Samvadini Indian App to Compete with WhatsApp
షార్ట్స్‌లో చూడండి
భారతదేశంలో వాట్సాప్‌కు పోటీగా మరో కొత్త స్వదేశీ మెసేజింగ్ యాప్ 'హైప్డ్ సంవాదిని' అందుబాటులోకి వచ్చింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏఐసీటీఈకి చెందిన 'అనువాదిని ఏఐ' ఈ యాప్‌ను రూపొందించింది. 'హైప్డ్ సంవాదిని' పేరుతో విడుదలైన ఈ యాప్, ప్రైవసీ, భద్రత, బహుభాషా సౌలభ్యమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం ఇది అందుబాటులో ఉంది.

ఈ యాప్‌లో పలు ప్రత్యేకమైన భద్రతా ఫీచర్లను పొందుపరిచారు. సిమ్ స్వాప్ మోసాలను గుర్తించేందుకు 'సిమ్, డివైస్ బైండింగ్' అనే ఫీచర్‌ను జోడించారు. దీనివల్ల యూజర్ ప్రమేయం లేకుండా సిమ్ మారితే వెంటనే అప్రమత్తం చేస్తుంది. అలాగే, ఫోన్ నంబర్ షేర్ చేయకుండా 'డైనమిక్ చాట్ ఐడీల' ద్వారా ఇతరులతో కనెక్ట్ అయ్యే అవకాశం కల్పించారు. దీనివల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లదు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో చాట్‌లు, కాల్స్ సురక్షితంగా ఉంటాయి.

భాషా పరమైన అడ్డంకులను తొలగించేందుకు ఇందులో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఏకంగా 22 భారతీయ భాషలు, 50కి పైగా అంతర్జాతీయ భాషల్లో రియల్-టైమ్ ట్రాన్స్‌లేషన్ (తక్షణ అనువాదం) ఫీచర్ ఉంది. వాట్సాప్ నుంచి తమ పాత చాట్‌లను సులభంగా ఇందులో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మహిళలు, వృద్ధుల భద్రత కోసం వన్-ట్యాప్ SOS అలర్ట్, లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ యాప్‌తో పాటు 'డెసి ఏఐ జెన్‌జెడ్ కీబోర్డ్'ను కూడా పరిచయం చేశారు. ఇది 22 భారతీయ భాషలకు సపోర్ట్ చేయడంతో పాటు స్మార్ట్ టైపింగ్ సలహాలు, గెస్చర్ టైపింగ్ వంటివి అందిస్తుంది. భారతీయుల అవసరాలు, భద్రతను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లో 'Hyped Samvadini' అని సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Go Back to Shorts
Hyped Samvadini
WhatsApp alternative
Indian messaging app
AICTE
Anuvadini AI
privacy
security
multilingual support
SIM binding
Desi AI GenZ Keyboard

More Telugu News