Radhika Sarathkumar: తమిళనాట 'తాయ్ కిళవి' సంచలనం.. కోట్లు కురిపిస్తున్న కంటెంట్!

Thaai Kizhavi Movie Update
  • తమిళంలో రూపొందిన 'తాయ్ కిళవి'
  • ప్రధాన పాత్రను పోషించిన రాధిక
  • మాస్ లుక్ తోనే పడిపోయిన మార్కులు  
  • రెండు వారాలలో 50 కోట్లకి పైగా వసూళ్లు
  • రాధిక కెరియర్లో గుర్తుండిపోయే సినిమా

తమిళనాట ఇప్పుడు ఎక్కడ చూసినా 'తాయ్ కిళవి' సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. శివకార్తికేయన్ - సుధాన్ సుందరం నిర్మించిన ఈ సినిమాకి, శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించాడు. రాధిక శరత్ కుమార్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన థియేటర్లలో విడుదలైంది. పోస్టర్స్ దగ్గర నుంచే బజ్ పెంచుకుంటూ వెళ్లిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. 

తొలి వారంలో 25 కోట్లను వసూలు చేసిన ఈ సినిమా, రెండో వారంతో కలుపుకుని 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. రాధిక మాస్ లుక్ .. ఆమె డైలాగ్ డెలివరీ.. బాడీ లాంగ్వేజ్ ఈ పాత్రను ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ చేశాయని అంటున్నారు. కథాకథనాలు.. పాత్రలను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు. రాధిక ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించారు. అయితే 60 ఏళ్లకి పైగా వయసున్న ఆమె, ఇప్పుడు చేసిన ఈ సినిమా 50 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం ఒక రికార్డుగా చెబుతున్నారు.

ఈ కథ ఒక విలేజ్ లో నడుస్తుంది. ఆ గ్రామంలో 'పవునుతాయి' అనే ఒక వయసుమళ్లిన మహిళ నివసిస్తూ ఉంటుంది. ఆ గ్రామంలో ఆమెకి గయ్యాళిగా పేరుంటుంది. అందువల్లనే ఆమె వడ్డీ వ్యాపారం దివ్యంగా సాగిపోతూ ఉంటుంది. అలాంటి ఆమె పక్షవాతం కారణంగా మంచాన పడుతుంది. మాట పడిపోయిన ఆమె, ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దాంతో ఆమె తాను దాచిన నిధిని గురించి చెప్పాలనుకుంటుందని భావించిన పిల్లలు ఏం చేస్తారు? అనేదే కథ. కామెడీ టచ్ తో సాగిపోయే ఈ ఫ్యామిలీ డ్రామాకి ఇప్పుడు విశేషమైన ఆదరణ లభిస్తోంది.

Radhika Sarathkumar
Thaaikizhavi
Tamil movie
Shivakarthikeyan
Sudhan Sundaram
Tamil cinema
box office collection
Tamil Nadu
village drama
family entertainment

More Telugu News