భారత విద్యార్థులకు కెనడా బంపరాఫర్

Canada Offers Massive Scholarship Program for Indian Students
  • భారత విద్యార్థుల కోసం కెనడా భారీ స్కాలర్‌షిప్ ఫండ్
  • 100 మిలియన్ డాలర్లతో ఏటా 200 మందికి ఉపకార వేతనాలు
  • టొరంటో యూనివర్సిటీ నిర్వహణలో పూర్తి విద్యా ఖర్చుల చెల్లింపు
  • భారత్‌లో మూడు హైబ్రిడ్ స్టడీ సెంటర్లు, ఇన్నోవేషన్ క్యాంపస్‌ల ఏర్పాటు
  • తిరుపతి ఐఐటీ, ఐసర్‌తో డల్హౌసీ యూనివర్సిటీ భాగస్వామ్యం
కెనడాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏకంగా 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ.921.6 కోట్లు) భారీ నిధితో స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. ఈ ఫండ్ ద్వారా ఏటా 200 మంది ప్రతిభావంతులైన భారతీయ విద్యార్థులను ఎంపిక చేసి, వారికి కోర్సు పూర్తయ్యేవరకు అయ్యే పూర్తి విద్యా ఖర్చులను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ టొరంటో నిర్వహిస్తుంది.

ఇటీవల కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత పర్యటన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. 'కెనడా-భారత్ టాలెంట్ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజీ'లో భాగంగా ఈ ఉపకార వేతనాల నిధిని ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ వ్యూహంలో భాగంగా భారత్‌లో మూడు ప్రాంతాల్లో హైబ్రిడ్ స్టడీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి అంశాలపై ఈ కేంద్రాల్లో బోధన, పరిశోధనలు జరుగుతాయి. వీటి ద్వారా కెనడా యూనివర్సిటీలు మన దేశంలో తమ కార్యకలాపాలను విస్తరించనున్నాయి.

కార్నీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల విద్యాసంస్థల మధ్య మొత్తం 13 ఒప్పందాలు కుదిరాయి. వీటిలో భాగంగా తిరుపతి ఐఐటీ, ఐసర్-తిరుపతి భాగస్వామ్యంతో డల్హౌసీ యూనివర్సిటీ మన దేశంలో ఓ ఇన్నోవేషన్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, మెక్‌గిల్ వర్సిటీలు కూడా భారత్‌లో తమ ఎక్స్‌లెన్స్ కేంద్రాలను నెలకొల్పనున్నాయి.
Go Back to Shorts
Indian Students
Canada Scholarships
Mark Carney
University of Toronto
Canada India Talent and Innovation Strategy
Artificial Intelligence
Science and Technology
Study in Canada
Canada Education
Scholarships for Indian Students

More Telugu News