Bangladesh: అవినీతిలో బంగ్లాదేశ్ ర్యాంకు ఎంతంటే..!
- అవినీతి సూచీ 2025లో బంగ్లాదేశ్‌కు 13వ అత్యల్ప ర్యాంక్
- 100 పాయింట్లకు గాను కేవలం 24 స్కోర్ సాధించిన బంగ్లా
- దక్షిణాసియాలో ఆఫ్ఘనిస్థాన్ తర్వాత అత్యంత అవినీతి దేశంగా గుర్తింపు
- ప్రజా తిరుగుబాటు తర్వాతా అవినీతిని అరికట్టడంలో విఫలమైన మధ్యంతర ప్రభుత్వం
- సంస్కరణలు చేపట్టకపోవడమే ర్యాంకు పతనానికి కారణమని నివేదిక వెల్లడి
పొరుగు దేశం బంగ్లాదేశ్ అవినీతి ఊబిలో కూరుకుపోయింది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ (టీఐ) విడుదల చేసిన వార్షిక అవినీతి సూచీ (CPI) 2025లో బంగ్లాదేశ్ అత్యంత నిరాశాజనకమైన పనితీరును కనబరిచింది. మొత్తం 182 దేశాల జాబితాలో 100కి కేవలం 24 పాయింట్ల స్కోర్‌తో 13వ స్థానంలో నిలిచింది. 2024 కంటే ఒక స్థానం దిగజారడమే కాకుండా, 2012-2025 మధ్య కాలంలోని సగటు స్కోర్ కంటే రెండు పాయింట్లు తక్కువ.
దక్షిణాసియా దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్ తర్వాత అత్యంత అవినీతిమయమైన దేశంగా బంగ్లాదేశ్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత తీవ్రమైన అవినీతి సమస్య ఉన్న దేశాల జాబితాలో బంగ్లాదేశ్ చేరినట్లు నివేదిక పేర్కొంది. ప్రపంచ సగటు స్కోర్ 42 కాగా, బంగ్లాదేశ్ దాని కంటే చాలా తక్కువ స్కోరుతో వెనుకబడింది.
గత ఏడాది జరిగిన జులై ప్రజా తిరుగుబాటు తర్వాత దేశంలో మార్పు వస్తుందని ఆశలు చిగురించాయి. అయితే, ఆ తర్వాత ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం అవినీతిని అరికట్టడంలో, పారదర్శక పాలనను అందించడంలో పూర్తిగా విఫలమైందని నివేదిక స్పష్టం చేసింది. రాజకీయ, పాలనాపరమైన రంగాల్లో అవినీతి యథేచ్ఛగా కొనసాగుతోందని తెలిపింది. అవినీతి నిరోధక కమిషన్ (ఏసీసీ) వంటి కీలక సంస్థల సంస్కరణలను ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించింది.
ఒకప్పుడు బంగ్లాదేశ్ కంటే తక్కువ స్కోర్‌తో ఉన్న నేపాల్, వియత్నాం, ఉక్రెయిన్ వంటి దేశాలు బలమైన సంస్కరణలు, డిజిటలైజేషన్, ఉన్నత స్థాయి అవినీతిపై కఠిన చర్యల ద్వారా తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నాయని నివేదిక గుర్తుచేసింది. రాజకీయ సంకల్పం లోపించడం, సంస్కరణల పట్ల నిర్లక్ష్యం వల్లే బంగ్లాదేశ్ ఈ దుస్థితిలో ఉందని విశ్లేషించింది.