గాలిలోనే పేలిన హెలికాప్టర్.. గ్రీస్‌లో అగ్నిమాపక ఆపరేషన్‌లో ప్రమాదం..వీడియో ఇదిగో!
- గ్రీస్‌లో కార్చిచ్చు ఆర్పే క్రమంలో ఘోర ప్రమాదం
- గాలిలో ఢీకొన్న రెండు ఫైర్ సర్వీస్ హెలికాప్టర్లు
- ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పైలట్లు
- పైలట్ల మృతిపై గ్రీస్ ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి
గ్రీస్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అడవుల్లో చెలరేగిన కార్చిచ్చును అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న రెండు అగ్నిమాపక హెలికాప్టర్లు గాలిలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ ఏథెన్స్‌లోని పసాతా తీర ప్రాంతంలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది.
అటికా-బొయోటియా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు గ్రీస్ ఫైర్ సర్వీస్‌కు చెందిన రెండు ‘బెల్’ హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. మంటలను అదుపు చేసే క్రమంలో ఈ రెండు హెలికాప్టర్లు అత్యంత సమీపంలోకి రావడంతో వాటి రోటార్లు (రెక్కలు) ఒకదానికొకటి బలంగా తాకాయి. దీంతో ఒక హెలికాప్టర్ గాలిలోనే పేలిపోయి నేలకూలింది.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరు పైలట్లను వెంటనే ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయని, ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మరణించారని గ్రీస్ ఫైర్ డిపార్ట్‌మెంట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ వాసిలిస్ వత్రాకోగియానిస్ అధికారికంగా ప్రకటించారు.
ఈ ఘటనపై గ్రీస్ ప్రధానమంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పైలట్ల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.