చాలా గ్యాప్ తర్వాత మరో సినిమాలో నటిస్తున్న రేణు దేశాయ్
- కొత్త సినిమా ప్రకటించిన రేణు దేశాయ్
- 'పదహారు రోజుల పండుగ'లో కీలక పాత్ర
- అనసూయతో కలిసి నటిస్తున్న వైనం
- నిర్మాత డీఎస్ రావు కుమారుడితో కొత్త చిత్రం
- సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో ఈ మూవీ
ఈ చిత్రంతో ప్రముఖ నిర్మాత డీఎస్ రావు తనయుడు సాయికృష్ణ దమ్మాలపాటి హీరోగా పరిచయం అవుతున్నారు. 2008లో నితిన్ నటించిన 'ద్రోణ' సినిమాలో ఉత్తమ బాల నటుడిగా సాయికృష్ణ నంది అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలో గోపికా ఉద్యన్ హీరోయిన్‌గా నటిస్తోంది. 'కేరింత', 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' వంటి చిత్రాలను తెరకెక్కించిన సాయికిరణ్ అడవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా.. సురేశ్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రేణు దేశాయ్, అనసూయతో పాటు కృష్ణుడు, వెన్నెల కిషోర్, విష్ణు వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.