‘వందేమాతరం’ను అవమానిస్తే ఇకపై శిక్ష.. రాజ్యసభలో బిల్లుకు ఆమోదం
- ప్రస్తుతం జాతీయ జెండా, జాతీయ గీతానికి ఉన్న చట్టపరమైన రక్షణ
- తాజాగా వందేమతరానికీ దాని విస్తరణ
- బిల్లును సమర్థించిన కేంద్రం
- రాష్ట్రపతి ఆమోదం తర్వాతే చట్టం
- సభలో ప్రతిపక్షాల ఆందోళన, వాకౌట్
జాతీయ గేయం ‘వందేమాతరం’ను ఉద్దేశపూర్వకంగా అవమానించడాన్ని శిక్షార్హ నేరంగా ప్రకటించే ‘జాతీయ గౌరవానికి అవమాన నిరోధక (సవరణ) బిల్లు-2026’కు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జాతీయ జెండా, జాతీయ గీతానికి ఉన్న చట్టపరమైన రక్షణను ఇకపై వందేమాతరానికీ వర్తింపజేయనున్నారు. బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం ఎగువ సభ దీన్ని ఆమోదించింది.
బిల్లుపై చర్చ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు రావాలని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఆప్, కాంగ్రెస్, సీపీఎం సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయగా, అనంతరం ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇరు పక్షాల సభ్యులు తమ అభిప్రాయాలు వెల్లడించిన తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానం ఇచ్చారు.
ఈ సందర్భంగా నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ, 1971లో జాతీయ చిహ్నాల పరిరక్షణ కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే రక్షణను వందేమాతరానికీ విస్తరిస్తున్నామని చెప్పారు. బంకించంద్ర చటర్జీ 1875లో ఈ గీతాన్ని రచించారని, 1896 కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారని వివరించారు. స్వాతంత్ర్య సమరయోధులు చివరి క్షణాల్లో కూడా ‘వందేమాతరం’ నినాదం చేశారని గుర్తుచేశారు.
ఈ బిల్లును వ్యతిరేకించడం జాతీయ నాయకుల భావాలకు విరుద్ధమని మంత్రి వ్యాఖ్యానించారు. దేశ ఐక్యత, జాతీయ భావనను బలోపేతం చేయడమే ఈ చట్టం ఉద్దేశమని చెప్పారు. దర్యాప్తు, చర్చల అనంతరం ప్రతిపక్షం వాకౌట్ చేసిన నేపథ్యంలో రాజ్యసభ బిల్లును ఆమోదించింది. ఇక ఈ బిల్లు చట్టంగా మారాలంటే రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంది.