వన్డేల్లో గిల్, టీ20ల్లో ఇషాన్ టాప్.. 230 స్థానాలు ఎగబాకిన యంగ్ సెన్సేషన్ వైభవ్!
- వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానానికి చేరిన గిల్
- టీ20 బ్యాటర్ల జాబితాలో నం.01 ర్యాంకును నిలబెట్టుకున్న ఇషాన్
- టీ20ల్లో 230 స్థానాలు ఎగబాకి టాప్ 50లోకి దూసుకొచ్చిన సూర్యవంశీ
- టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 31 స్థానాలు మెరుగుపరుచుకున్న బిష్ణోయ్
ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వన్డే బ్యాటింగ్ చార్టుల్లో మళ్లీ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకోగా, 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ టీ20ల్లో సంచలనం సృష్టించాడు. జింబాబ్వేతో సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఏకంగా 230 స్థానాలు ఎగబాకి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఇటీవల హరారేలో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్యవంశీ, 50.33 సగటుతో 151 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును అందుకున్నాడు. ఈ ప్రదర్శనతో అతను టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 230 స్థానాలు మెరుగుపరుచుకుని, తొలిసారి టాప్ 50లోకి అడుగుపెట్టి 48వ ర్యాంకులో నిలిచాడు.
మరోవైపు టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తన నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. జింబాబ్వే సిరీస్‌లో 81 పరుగుల ఇన్నింగ్స్‌తో రాణించిన కిషన్, ప్రస్తుతం 910 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇదే సిరీస్‌లో అతను తన కెరీర్ బెస్ట్ 916 పాయింట్లను కూడా అందుకున్నాడు. టీ20 బ్యాటింగ్ ఆల్-టైమ్ రేటింగ్స్‌లో అభిషేక్ శర్మ (931), డేవిడ్ మలన్ (919) తర్వాత ఇది మూడో అత్యధికం.
ఇదే జాబితాలో తిలక్ వర్మ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 6వ ర్యాంకుకు, శ్రేయస్ అయ్యర్ ఏడు స్థానాలు ఎగబాకి 24వ ర్యాంకుకు చేరుకున్నారు. బౌలింగ్‌లో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ 31 స్థానాలు దూసుకెళ్లి 41వ ర్యాంకును దక్కించుకున్నాడు.
ఇక, వన్డే ఫార్మాట్‌లో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ అగ్రస్థానం నుంచి కిందకు జారడంతో శుభ్‌మన్ గిల్‌కు మళ్లీ నంబర్ వన్ కిరీటం దక్కింది. మిచెల్ జనవరి నుంచి అగ్రస్థానంలో ఉండగా, ఇటీవల అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉండటం గిల్‌కు కలిసొచ్చింది.
టెస్ట్ క్రికెట్‌లోనూ పలువురు ఆటగాళ్లు తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. పాకిస్థాన్‌పై అద్భుతంగా రాణించిన వెస్టిండీస్ ఆల్-రౌండర్ జస్టిన్ గ్రీవ్స్, బౌలర్ల జాబితాలో 21 స్థానాలు ఎగబాకి 48వ ర్యాంకును, ఆల్-రౌండర్ల జాబితాలో 9వ ర్యాంకును అందుకున్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని టెస్ట్ బ్యాటింగ్‌లో 15వ స్థానంలో నిలిచాడు.