"శభాష్ ఛాంప్"... మనవడు దేవాన్ష్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు
- దేవాన్ష్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు 2025 ప్రదానం
- లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ హాల్‌లో పురస్కారం అందజేత
- అత్యంత వేగంగా 175 చెక్‌మేట్ పజిల్స్ సాల్వ్ చేసి రికార్డు
- దేవాన్ష్ సాధించిన విజయంపై సీఎం చంద్రబాబు హర్షం
- ఇది పట్టుదల, గురువుల మార్గదర్శకత్వంతో సాధ్యమైందని ప్రశంస
చెస్ గేమ్‌లో అత్యంత వేగంగా చెక్‌మేట్ పజిల్స్‌ను ఛేదించిన వ్యక్తిగా దేవాన్ష్ ఈ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. మొత్తం 175 పజిల్స్‌ను వేగంగా పూర్తి చేసి ఈ ఘనత సాధించాడు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు, "మా దేవాన్ష్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు 2025 అందుకోవడం గర్వంగా ఉంది" అని తెలిపారు.
నెలల తరబడి చూపిన పట్టుదల, గురువుల మార్గదర్శకత్వం వల్లే ఈ విజయం సాధ్యమైందని చంద్రబాబు పేర్కొన్నారు. దేవాన్ష్ సాధించిన ఈ రికార్డు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన దేవాన్ష్‌ను 'శభాష్ ఛాంప్' అంటూ ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికపై దేవాన్ష్ ప్రతిభకు గుర్తింపు లభించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.