తనను తానే డెలివరీ చేసుకున్న సెల్ఫ్ డ్రైవింగ్ కారు.. వీడియో ఇదిగో!
- ప్రపంచంలోనే తొలి అటానమస్ డెలివరీ
- టెక్సస్‌లో సుమారు 30 నిమిషాల పాటు సాగిన ప్రయాణం
- గంటకు 115 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన టెస్లా మోడల్ వై
ఈ ప్రయాణంలో గంటకు 115 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని కూడా అందుకున్నట్లు టెస్లా సిబ్బంది తెలిపారు. ఈ మొత్తం ప్రయాణాన్ని వెనుక సీటు నుంచి వీడియో తీసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ చరిత్రాత్మక ఘట్టంపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ స్పందించారు. "షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే తొలి పూర్తి అటానమస్ డెలివరీ పూర్తయింది. కారులో గానీ, రిమోట్‌గా గానీ ఎవరూ నియంత్రించలేదు. ఇది పూర్తిగా అటానమస్!" అని ఆయన 'ఎక్స్' వేదికగా ప్రకటించారు.
ఇటీవల ఆస్టిన్‌లో రోబో ట్యాక్సీ సేవలను పరీక్షించడం ప్రారంభించిన టెస్లా, భవిష్యత్తులో మిలియన్ల కొద్దీ రోబో ట్యాక్సీలను రోడ్లపైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ అటానమస్ డెలివరీ టెక్నాలజీ రంగంలో ఒక కీలక మైలురాయిగా నిపుణులు భావిస్తున్నారు. అయితే, భవిష్యత్తులో కార్ల డెలివరీలన్నింటినీ ఇదే పద్ధతిలో చేస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.