దిశ శాలియన్ కేసు: ఆమె ఎవరో కూడా తెలియదన్న ఆదిత్య థాకరే
- దిశ శాలియన్ కేసులో తన పేరు చేర్చడంపై స్పందించిన ఆదిత్య థాకరే
- రాజకీయ దురుద్దేశంతోనే తన ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం
- ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్య
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశ శాలియన్ మృతి కేసులో తన పేరును చేర్చడంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే తొలిసారిగా స్పందించారు. అసలు దిశ శాలియన్ ఎవరో కూడా తనకు తెలియదని, ఆమెను తాను ఎప్పుడూ కలవలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ఒక పోస్టు పెట్టారు.
రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు ఉద్దేశపూర్వకంగానే తనను లక్ష్యంగా చేసుకుని, తన ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆదిత్య ఆరోపించారు. ఎటువంటి ఆధారాలు లేదా వాస్తవాలు లేకుండా తనపై నిందారోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి కుట్రపూరిత చర్యలతో ప్రజా క్షేత్రంలో తమ పోరాటాన్ని అడ్డుకోలేరని తేల్చిచెప్పారు. ఈ కేసు దర్యాప్తు ఎటువంటి రాజకీయ జోక్యం, వ్యక్తిత్వ హననం లేకుండా నిష్పక్షపాతంగా, సజావుగా సాగాలని కోరారు.
2020 జూన్ 8న దిశ శాలియన్ అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులకే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా తన నివాసంలో విగతజీవిగా కనిపించారు. ఈ జంట మరణాలు అప్పట్లో మహారాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. అప్పట్లోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఈ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందంటూ ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
ఇటీవల బాంబే హైకోర్టు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ఆదిత్య థాకరేతో పాటు నటులు డీనో మోరియా, రియా చక్రవర్తి పేర్లను చేర్చినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆదిత్య థాకరే పైవిధంగా స్పందించారు.