ఫ్రాంచైజీల విజ్ఞప్తి.. ఇకపై ఇండియాలోనే ఐపీఎల్ మినీ వేలం
- స్వదేశానికి తిరిగి రానున్న ఐపీఎల్ మినీ వేలం
- ఫ్రాంచైజీల విజ్ఞప్తితో పాలకమండలి నిర్ణయం
- 2024 నుంచి దుబాయ్, జెడ్డా వంటి నగరాల్లో వేలం
- వేదికపై ఇంకా రాని స్పష్టత
- ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై కొనసాగుతున్న చర్చ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలాన్ని తిరిగి భారత్‌లోనే నిర్వహించాలని ఐపీఎల్ పాలకమండలి (జీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్లుగా విదేశాల్లో నిర్వహిస్తున్న ఈ సంప్రదాయానికి స్వస్తి పలకాలని మంగళవారం జరిగిన పాలకమండలి సమావేశంలో తీర్మానించారు.
2024 నుంచి ఐపీఎల్ వేలాన్ని దుబాయ్, జెడ్డా, అబుదాబి వంటి విదేశీ నగరాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, మినీ వేలం కోసం తమ బృందాలను విదేశాలకు తరలించడం రవాణా పరంగా, నిర్వహణాపరంగా సవాలుగా మారుతోందని ఫ్రాంచైజీలు ఆందోళన వ్యక్తం చేశాయి. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న గవర్నింగ్ కౌన్సిల్, 2027 మినీ వేలాన్ని భారత్‌లోనే నిర్వహించాలని నిర్ణయించింది.
అయితే, వేలం నిర్వహించే నగరాన్ని ఇంకా ఖరారు చేయలేదు. పెళ్లిళ్ల సీజన్ దృష్ట్యా హోటల్ గదుల లభ్యతను బట్టి వేదికను ఖరారు చేయనున్నారు. మినీ వేలాన్ని భారత్‌కు మార్చినప్పటికీ, ఆ తర్వాతి ఏడాది జరిగే మెగా వేలాన్ని మాత్రం విదేశాల్లోనే నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.
ఇదే సమావేశంలో 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధనపై కూడా పాలకమండలి సుదీర్ఘంగా చర్చించింది. ఈ నిబంధనపై ఫ్రాంచైజీల నుంచి అభిప్రాయాలను స్వీకరించి, తదుపరి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది.