రండి... మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి: సీఎం చంద్రబాబు
- ఈ నెల 21న విశాఖలో 'యోగాంధ్ర' కార్యక్రమం
- ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోదీ
- సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ప్రజలకు ఆహ్వానం
- యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం పెంపు
- కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు
"ప్రపంచానికి భారత దేశం ప్రసాదించిన దివ్య వరం… యోగ. ఆరోగ్యాన్నే కాకుండా ఆయుష్షును పెంచే యోగ మన జీవన విధానం కావాలి. ఈ నెల 21న విశాఖపట్నంలో 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారు. రండి… మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. యోగాను జీవితంలో భాగం చేసుకుందాం… ఆరోగ్యంగా జీవిద్దాం" అని చంద్రబాబు పేర్కొన్నారు.
"ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరం. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఎంతగానో తోడ్పడుతుంది. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ యోగా దినోత్సవంలో మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొంటున్నారు. రికార్డు స్థాయిలో నిర్వహించే ఈ వేడుకను విజయవంతం చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరుతున్నాను. యోగా వ్యాయామం మాత్రమే కాదు మన జీవన విధానం అని చాటిచెప్పండి" అని నారా లోకేశ్ వివరించారు.