సజ్జల భార్గవరెడ్డి ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవు: మంగళగిరి సీఐ
- సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసు
- మంగళగిరి పీఎస్ లో సజ్జల భార్గవరెడ్డి విచారణ
- మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం
ఈ కేసుకు సంబంధించి మంగళగిరి పట్టణ సీఐ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, సజ్జల భార్గవ్‌రెడ్డిని విచారించామని... విచారణ సందర్భంగా ఆయన చెప్పిన సమాధానాలు తమకు సంతృప్తినివ్వలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసి, తిరిగి విచారించే అవకాశం ఉందని సీఐ సూచనప్రాయంగా తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద, అసభ్యకరమైన పోస్టులు షేర్ చేశారనే ఆరోపణలతో సజ్జల భార్గవ్‌రెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగానే మంగళగిరి పోలీసులు ఆయనను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించారు. ప్రస్తుతం పోలీసులు తదుపరి చర్యలపై దృష్టి సారించినట్లు సమాచారం.