నాలోని ఒరిజినల్ అలాగే ఉంది... ఎవరూ డీలా పడొద్దు: పరిటాల శ్రీరామ్
- ధర్మవరం మినీ మహానాడులో శ్రీరామ్ కీలక వ్యాఖ్యలు
- కార్యకర్తలు బయపడొద్దని వ్యాఖ్య
- ఇంకా నాలుగేళ్ల సమయం ఉందన్న శ్రీరామ్
కార్యకర్తలు నిరాశ చెందవద్దని సూచిస్తూ, "పొద్దు మునగాలంటేనే సమయం పడుతుంది. ఎందుకు మీరు డీలా పడిపోతున్నారు?" అని ప్రశ్నించారు. "మీరు తప్పు చేసినా, ఒప్పు చేసినా మీ వెంటే ఉంటాను. నా వెంట నడిచి వచ్చిన వారిని ఎవర్నీ మర్చిపోలేదు" అంటూ వారికి అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. గ్రామాల్లో ఎవరికీ భయపడకుండా ధైర్యంగా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ధర్మవరం నుంచి పోటీ చేయాలని భావించారు. ఆ దిశగా నియోజకవర్గంలో విస్తృతంగా పనిచేశారు కూడా. అయితే, ఎన్నికల పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. దీంతో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సత్యకుమార్ యాదవ్ విజయం సాధించి, ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, ధర్మవరం మినీ మహానాడులో పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆయన మాటల్లోని అంతరార్థాలపై స్థానిక రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.